Rakhi Gift Ideas: మీ ఆత్మీయ సోదరికి బెస్ట్‌ రక్షాబంధన్ గిప్ట్‌ ఇస్తారా! 10 బెస్ట్‌ ఐడియాలు

best rakhi gift for sister

అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ (Raksha Bandhan). ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తోబుట్టువులను కలుసుకొనేందుకు, వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకొనేందుకు, కష్టసుఖాలను పంచుకొనేందుకు మన దేశంలోనే ఈ పండుగను జరుపుకుంటారు. సోదరులు తమకు రక్షణగా ఉండాలని రాఖీ కడతారు. నిజానికి వారు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే రాఖీ కడతారు. హారతినిస్తారు. అయితే ప్రేమతో తమ వద్దకొచ్చిన సోదరిని ఊరికే పంపించరు కదా! ఏదో ఒక మంచి గిఫ్ట్‌ (best rakhi gift ideas) ఇచ్చి వారిని సంతోష పెడతారు. అసలు సోదరీమణులకు ఎలాంటి బహుమతులు (top 10 rakhi gifts for sister) ఇవ్వొచ్చో ఓసారి చూద్దాం!

 • విలువైన చీరలు
 • మెరిసే నగలు
 • హ్యాండు బ్యాగులు, వ్యాలెట్లు
 • వాచ్‌, స్మార్ట్‌ వాచ్‌
 • దీపం కుందులు, కుంకుడుకాయ
 • రైస్‌ కుక్కర్, కిచెన్‌ అప్లయెన్సెస్‌
 • వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌
 • మేకప్‌ కిట్స్‌, సౌందర్య సాధనాలు
 • ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్‌
 • అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డ్స్
 • బుక్స్‌, ఈ-బుక్స్‌

చీర, సారె

పెళ్లైన ప్రతి సోదరి రాఖీ పండుగ రోజు తిరిగి అన్నదమ్ముల ఇంటికి వస్తుంది. వారికి రాఖీకడుతుంది. ఆ ప్రేమ మూర్తికి ఒక చక్కని saree కొనివ్వడం మన సంప్రదాయం. అసలు చీరలను ఇష్టపడిని ఆడవాళ్లు ఉంటారా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు Amazon, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ చక్కని చీరలు లభిస్తున్నాయి. పట్టు చీరలు, డిజైనర్‌ చీరలు, ఆఫీసులకు కట్టుకొళ్లేందుకు కాటన్‌ చీరలు, పెళ్లిల్లు, వేడుకలకు ఫ్యాన్సీ చీరలు ఎంతో బాగుంటాయి. మీకు అందుబాటులో ధరలో మంచి చీరను వారికి ప్రజెంట్‌ చేయొచ్చు.

బంగారం, నగలు

పుత్తడిని ఇష్టపడిని పుత్తడి బొమ్మలు ఉంటారా చెప్పండి. ఆడవాళ్లకు బంగారమంటే (Gold) ఎంతో మక్కువు. అందుకే బంగారం, వెండి, ప్లాటినం వంటి నగలు వారికి కొనివ్వొచ్చు. మీ స్తోమతను బట్టే ఇవ్వండి. ఎక్కువ ధర పెట్టలేకపోతే ఇప్పుడు వన్‌ గ్రామ్‌ గోల్డులోనూ మంచి ఆర్నమెంట్స్‌ లభిస్తున్నాయి. బంగారు పూత పూసిన వెండి నగలు ఇప్పుడు ప్యాషన్‌. అలా కాదు డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold), డిజిటల్‌ సిల్వర్‌ను ఇవ్వొచ్చు. పేటీఎం, ఫోన్‌ పే వంటి యాప్స్‌లో కొని వారికి బదిలీచేయొచ్చు. బంగారం, వెండి కాయిన్లూ మంచి ఆప్షనే.

హ్యాండ్‌ బ్యాగులు, వ్యాలెట్లు

మహిళలు బయటకు వెళ్తే కంపల్సరీగా ఒక బ్యాగు (Hand bags) లేదా వ్యాలెట్‌ (Wallet) తీసుకెళ్తారు. తమ వస్తువలను అందులో ఉంచుకుంటారు. లిప్‌స్టిక్‌ నుంచి మేకప్‌ సామగ్రి వరకు ఎన్నింటినో ఇందులో పెట్టుకుంటారు. యువతులు, టీనేజర్స్‌కు స్టైలిష్‌ హ్యాండ్‌ బ్యాగులు ఇవ్వండి. పెళ్లైన, పిల్లలున్న మహిళలకు కాస్త పెద్ద సైజులో చక్కని హ్యాండ్‌ బ్యాగులు ఇవ్వండి.

వాచ్‌, స్మార్ట్‌ వాచ్‌

గడియారం ఉందంటే కాలం విలువ తెలిసినట్టే! చేతికి Smart Watch పెట్టుకొంటే ఆ లుక్కే వేరబ్బా! మీ గారాల సోదరీమణులకు ఓ మంచి వాచీ ప్లాన్ చేయండి. ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌లూ వస్తున్నాయి. ఇందులో ఫిట్‌నెస్ అంశాలూ ఉంటాయి. కాబట్టి వారు ఎంత తింటున్నారు? ఎంత తినాలి? కెలోరీలు, చేసిన ఎక్సర్‌సైజులు, ఇంకా నడవాల్సిన దూరం వంటి ఆప్షన్లు ఉంటాయి. వారి ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ఇదో best gift అవుతుంది.

దీపం కుందులు, కుంకుడుకాయ

అక్కాచెల్లెల్లు చిరకాలం సౌభాగ్యవుతులుగా ఉండాలని అంతా కోరుకుంటారు. అందుకోసమే తపిస్తారు. అంతేకాకుండా పెళ్లైనవాళ్లు ఎన్నో పూజలు చేస్తుంటారు. ప్రతి పండగకు వ్రతాలు చేస్తుంటారు. అలాంటి వారికి మంచి దీపపు కుందులు, కుంకుడు కాయలు ఇవ్వండి. ఇప్పుడు రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. వెండి, ఇత్తడికి బెస్ట్‌ ఆప్షన్‌. సాధ్యమైంనత వరకు అల్యూమినియం వస్తువుల వైపు వెళ్లకండి.

రైస్‌ కుక్కర్, కిచెన్‌ అప్లయెన్సెస్‌

అందరికీ ఉపయోగపడే గిప్ట్‌లు రైస్‌ కుక్కర్‌ (Rice Cookers), కిచెన్‌ అప్లయెన్సెస్‌ (Kitchen Appliances). ఉదాహరణకు ఇంట్లో అందరికీ త్వరగా వంట చేసేందుకు రైస్‌ కుక్కర్లు ఉపయోగపడతాయి. ఇక మిక్సర్ గ్రైండర్‌ (mixer Grinder), వంట పాత్రలు, మైక్రో ఓవెన్‌, రాగి, ఇత్తడి పాత్రలు ఎంతో బాగుంటాయి. అలాగే నూనె తక్కువ వాడేందుకు, జీరో ఆయిల్‌తో వంట చేసేందుకు క్యాస్ట్‌ ఐరన్‌ (Cast Iron) పాత్రలు ఎంతో మంచిది.

వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కూడా మంచి ఆప్షన్‌. కాలేజీకి వెళ్లే చెల్లెల్లు, ఆఫీసులకు వెళ్లే అక్కలకు వైర్‌ లెస్‌ ఇయర్‌ బడ్స్‌ (Wireless earbuds) అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకప్పటిలా ఇప్పుడు వైర్‌తో ఉండే ఇయర్‌ఫోన్స్‌ ఎవరూ వాడటం లేదు. పైగా ప్యాషన్‌ కాదు. ఇప్పుడు వెయ్యి రూపాయల్లోనూ చక్కని ఇయర్‌ బడ్స్‌ వస్తున్నాయి. ఒప్పో, బోట్‌, పోకో వంటివి ట్రై చేయొచ్చు. ఇంకాస్త కాస్ట్లీవి కావాలంటే వన్‌ ప్లస్‌, యాపిల్‌ వంటివి చూదొచ్చు.

మేకప్‌ కిట్స్‌, సౌందర్య సాధనాలు

కాలం గడిచే కొద్దీ సౌందర్య సాధనాల (Beauty Products) వినియోగం బాగా పెరిగిపోయింది. అక్కాచెల్లెల్లకు కాస్మొటిక్స్‌ ప్రొడక్ట్స్‌ ఇవ్వడమూ ఒక బెస్ట్‌ గిఫ్టే! మీ చెల్లెలికి ఇష్టమైన బ్రాండ్‌ ఉండొచ్చు. అది కాస్త కాస్ట్లీ అవ్వొచ్చు. అలాంటివి సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇవ్వండి. క్లెన్జర్స్‌, క్లీనర్స్‌, స్క్రబ్బర్స్‌, స్కిన్‌ టోనర్స్‌, సోప్స్‌, పేస్‌ క్రీమ్స్‌, ఫేస్‌ వాష్‌, డియెడ్రెంట్లు ఇవ్వండి.

ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్‌

చాలా మంది మహిళలు పనిలో పడి ఫిట్‌నెస్‌పై (Fitness) దృష్టిపెట్టరు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే మీ సోదరీమణులకు ఇంట్లో ఎక్సర్‌సైజులు చేసుకొనే ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌ బహుమతిగా ఇవ్వండి. హ్యాండ్‌ గ్రిప్సర్స్‌, ట్రెడ్‌ మిల్స్‌, స్ట్రెచర్స్‌, డంబెల్స్‌ వంటివి కొనివ్వండి.

అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డ్స్

ఆన్‌లైన్ షాపింగ్‌ వెబ్‌సైట్‌ Amazon Gift Cards ప్లాన్ చేయండి. ఈ-గిఫ్ట్‌ కార్డులు, ఫిజికల్‌ గిఫ్ట్‌ కార్డులు, బ్రాండెడ్‌ గిప్ట్‌ కార్డులు, కార్పొరేట్‌ గిఫ్ట్‌ కార్డుల్లో అనువైనది ఎంచుకోండి. ఉదాహరణకు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటే బ్రాండ్‌ గిఫ్ట్‌ కార్డులు బాగుంటాయి. online shopping ఎక్కువగా చేస్తే కూడా ఉపయోగపడుతుంది. రక్షాబంధన్ గిప్ట్‌ కార్డులు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

బుక్స్‌, ఈ-బుక్స్‌`

మానసిక ప్రశాంతతకు Books ఎంతో ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అమెజాన్లో అద్భుతమైన పుస్తకాలను తక్కువ ధరకే అందిస్తుంటారు. పండుగల సందర్భంగా ఆఫర్లు వస్తుంటాయి. ఎంపవర్‌మెంట్, ఫైనాన్షియల్‌ నాలెడ్జ్‌ పెంచే బుక్స్‌ ప్రజెంట్‌ చేయండి. ఈ-బుక్స్‌ ఇవ్వడమూ మంచి ఆప్షనే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top