Poco Pods Review: బడ్జెట్ ఫ్రెండ్లీ పోకో పాడ్స్‌లో ఇన్ని ప్రీమియం ఫీచర్లా!

poco pods

స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు గ్యాడ్జెట్ల విభాగంలోకి రావడం కొత్తేమీ కాదు! OPPO వంటి బ్రాండ్లు ఇప్పటికే ఆ పనిచేశాయి. తాజాగా Xiaomi సబ్‌బ్రాండ్‌ POCO వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. మిడ్‌రేంజ్‌, అందుబాటు ధరల్లో వెతికే వారే లక్ష్యంగా వీటిని రూపొందించింది. ఈ ఏడాది జులైలో Poco Pods మార్కెట్లో డెబ్యూ చేశాయి. Poco Pods price రూ.1199 మాత్రమే. ఖరీదైన హెడ్‌ఫోన్లలో ఉండే కొన్ని ఫీచర్లు ఇందులోనూ ఉండటం హెడ్‌ఫోన్స్‌ను ఆకర్షణీయంగా మార్చింది.

పోకో పాడ్స్‌ బ్లూటూత్‌ 5.3 ఆధారంగా పనిచేస్తాయి. ఇది లో లేటెన్సీలో కనెక్షన్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఇందులో గేమింగ్‌ మోడ్‌ కూడా ఉంది. వీడియోతో ఆడియో సింక్‌ మెరుగ్గా ఉంచేందుకు గేమ్స్‌ ఆడేటప్పుడు లేటెన్సీని తక్కువగా చేస్తుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌కు IPX4 రేటింగ్‌ ఉంది. అంటే నీటి చుక్కలు పడినా, చెమట బిందువులతో తడిచినా ఇబ్బందేమీ ఉండదు. ఈ హెడ్‌ఫోన్స్‌లో 12mm డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించారు. మంచి బేస్‌తో క్వాలిటీ సౌండ్‌ను స్పష్టంగా వినేందుకు ఇవి సాయపడతాయి. ఇందులోని టచ్‌ కంట్రోల్స్‌తో ప్లే, పాజ్‌, స్కిప్‌ ట్రాక్స్‌, వాయిస్‌ అసిస్టెంట్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఈ పోకో పాడ్స్‌తో ఛార్జింగ్‌ కేస్‌ వస్తోంది. USB Type-C port ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. కేవలం గంటలోనే బ్యాటరీ మొత్తం ఛార్జ్‌ అవుతుంది. 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్ (poco pods battery life) ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఆరు గంటల వరకు పాటలు వినొచ్చు. అయితే ఇందులో కొన్ని నెగెటివ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ పోకో పాడ్స్‌ AAC Bluetooth codecను సపోర్ట్‌ చేయవు. యాప్‌ లేకపోవడంతో టచ్‌ కంట్రోల్స్‌ను మనకు నచ్చినట్టుగా సెట్టింగ్స్‌లో మార్చుకోలేము. కాల్‌ క్వాలిటీ అంతగా లేదంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ నాయిస్‌ ఎక్కువగా వినిపిస్తోంది.

OnePlus Buds Z2, the Boat Airdopes 441, Oppo Enco Xతో పోల్చితే Poco Pods కొన్ని ఫీచర్స్‌ తక్కువగాఉన్నాయి. బెటర్‌ సౌండ్‌ కంట్రోల్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌, కస్టమైజ్‌ ఆప్షన్స్‌ వంటివి లేవు. అయితే పోకోతో పోలిస్తే వాటి ధరలు కాస్త ఎక్కువే అన్నది గుర్తించాలి. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఇయర్ పాడ్స్‌ కావాలంటే పోకోపాడ్స్‌ను ప్రయత్నించొచ్చు. ఇంత తక్కువ ధరలో కొన్ని ఫీచర్స్‌ రావడం అరుదే అనుకోవాలి.

పోకో పాడ్స్ రేంజులో లభిస్తున్న ఇతర ఇయర్ పాడ్స్.. ఓ లుక్కేయండి!

1 thought on “Poco Pods Review: బడ్జెట్ ఫ్రెండ్లీ పోకో పాడ్స్‌లో ఇన్ని ప్రీమియం ఫీచర్లా!”

  1. Pingback: How to Save 70% on boAt Rockerz 255 Pro+ Bluetooth in Ear Earphones: A Review of the Features and Benefits - offers BRO

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top