ఒకప్పుడు ఏం కావాలన్నా స్టోర్‌కు వెళ్లక తప్పేది కాదు. బట్టలు కావాలంటే క్లాత్ స్టోర్.. గ్యాడ్జెట్స్ కావాలంటే ఎలక్ట్రానిక్ షోరూమ్స్.. హోమ్ నీడ్స్ కావాలంటే అప్లయన్సెస్ స్టోర్లకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు కాలం మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మన జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. ఈ-కామర్స్ ఆవిర్భావంతో షాపింగ్ చేసే తీరు మారిపోయింది.
ఇప్పుడైతే Online Shopping ఒక విప్లవంగా తయారైంది. Amazon, Flipkart, మింత్రా, క్రోమా వంటి వెబ్సైట్లను విజిట్ చేసి అన్నీ కొనుగోలు చేసేస్తున్నాం. అయితే చాలా మందికి కొన్ని కన్ఫ్యూషన్లు ఉన్నాయి. మన డబ్బుకు బెస్ట్ వాల్యూ దక్కుతోందా? ఆన్లైన్లో బెస్ట్ డీల్స్, డిస్కౌంట్లు ఎలా పొందొచ్చు? ఎలాంటి టెక్నిక్స్ వాడితే మనకు బెస్ట్ డీల్స్ దొరుకుతాయో చూద్దాం!!
TIP 1: వేర్వేరు వెబ్సైట్లలో ధరలను కంపేర్ చేయండి
ఆన్లైన్ బెస్ట్‌డీల్స్, డిస్కౌంట్లు పొందేందుకు సులువైన మార్గం ఒకటుంది! వేర్వేరు షాపింగ్ లేదా ఈకామర్స్ వెబ్సైట్లను విజిట్ చేయాలి. ఇందుకోసం google, bing వంటి సెర్చ్ ఇంజిన్ల సాయం తీసుకోవచ్చు.
మనం వెతుకున్న ప్రొడక్ట్ ఏ షాపింగ్ వెబ్సైట్లో తక్కువకు వస్తుందో సెర్చ్ చేయొచ్చు. రెండు మూడు వెబ్సైట్లను పక్క పక్క ట్యాబుల్లో ఓపెన్ చేసి ధరలను కంపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా Pricegrabber, Shopzilla, gadgets360, latestdealsbro వంటి వెబ్సైట్లు ధరలను పోల్చి మీ పని సులువు చేస్తాయి. అయితే కొన్ని వెబ్సైట్లు shipping fee, టాక్సులు, ఇతర హిడెన్ ఛార్జెస్‌ను అసలు ధరలో కలిపి చూపించవు. అలాంటి వాటిని ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
TIP 2: కూపన్లు, ప్రోమో కోడ్లు వాడుకోండి
చాలా మందికి ఇది తెలిసిన విషయమే! షాపింగ్ వెబ్సైట్లు కస్టమర్లకు Coupons, promo codes ఇస్తుంటాయి. మీరు ఏదైనా ప్రొడక్ట్ ఎంచుకొని చెక్ఔట్ చేస్తున్నప్పుడు ఈ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా discounts పొందొచ్చు. చాలా సోర్సెస్ మీకు కూపన్ కోడ్లను అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ వెబ్సైట్లు తమ లాయల్ కస్టమర్లకు ప్రతి వస్తువుపై ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కంపెనీల సౌజన్యంతో వీటిని అందిస్తున్నాయి. Ratailmenot, coupons.com వంటి వెబ్సైట్లూ ప్రోమో కోడ్స్ ఉంటాయి. Capital one shopping, Honey వంటి బ్రౌజర్ ఎక్స్టెన్షన్లూ మీకు బెస్ట్ కూపన్స్, ప్రోమోకోడ్స్ వెతికిపెడతాయి. Facebook, twitter, Instagram వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చాలామంది తమ ఫాలోవర్లకు కూపన్లు ప్రొవైడ్ చేస్తున్నారు.
TIP 3: క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు
ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు cash back, Reward Programmes ఉపయోగించుకొని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసినప్పుడు ఆ కంపెనీలు కొంత డబ్బును వెనక్కి ఇస్తుంటాయి. మరికొన్ని రివార్డు పాయింట్లు కేటాయిస్తాయి. వీటిని రీడీమ్ చేసుకొంటే డబ్బులు వస్తాయి. వాటిని మళ్లీ షాపింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. HDFC, ICICI, SBI సహా అన్ని బ్యాంకుల క్రెడిట్,
డెబిట్ కార్డులపై ఇప్పుడు రివార్డు పాయింట్లు వస్తున్నాయి. ఆ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేస్తే చాలు. Rakuten లేదా TopCashback వంటి వెబ్సైట్లు ఆన్లైన్ రిటైలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. వాళ్ల లింకుల నుంచి షాపింగ్ చేస్తే కమిషన్ డబ్బులో కొంత మీకు ఇస్తాయి. షాపింగ్, వీడియోలు చూడటం, సర్వేల్లో పాల్గొనడం, గేమ్స్ ఆడితే Swagbucks లేదా MyPoints వంటి రివార్డు వెబ్సైట్లు పాయింట్లు ఇస్తాయి. వాటిని గిఫ్ట్‌కార్డుల రూపంలోకి మార్చుకోవచ్చు.
TIP 4: సరైన సమయంలో షాపింగ్ చేయడం
రిటైలర్లు, ఆన్ లైన్ షాపింగ్ వెబ్సైట్లు సంవత్సరంలో చాలాసార్లు మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని ప్రత్యేకమైన రోజులు, నెలలు, సీజన్లను ఇందుకు ఎంచుకుంటాయి. బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే, క్రిస్మస్, వాలెంటైన్ డే, మదర్స్ డేలకు విదేశాల్లో డిస్కౌంట్లు ఇవ్వడం మనకు తెలిసిందే. మన దేశంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ వెబ్సైట్లు ఆగస్టు 15, జనవరి 26, దసరా, దీపావళి సీజన్లో స్పెషల్ డీల్స్, డిస్కౌంట్స్ ఇస్తాయి. Freedom sale, Great Indian sale ఇలాంటివే. చలికాలం, ఎండాకాలం, వానాకాలంలోనూ కొన్ని ప్రత్యేక వస్తువులపై డిస్కౌంట్లు, డీల్స్ వస్తాయి.
ముగింపు
ఇవండీ..! ఆన్లైన్ షాపింగ్‌లో మరింత డబ్బు ఆదా చేసుకొనే మార్గాలు. వేర్వేరు వెబ్సైట్లలో కంపేర్ చేయడం వల్ల చాలా వరకు లాభం ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తున్న వెబ్సైట్లో కొనొచ్చు. కూపన్లు, ప్రోమో కోడ్స్తోనూ ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే చాలా మందికి తెలిసిన విషయమిది. క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్ల వంటి ప్రోగ్రాములూ ఉపయోగపడతాయి. సమ్మర్, స్ప్రింగ్, మాన్సూన్, దసర, దీపావళి సీజన్ల ఆఫర్లూ తెలిసినవే. amazon sale, flipkart sale ఈ కోవకే చెందుతాయి.