Itel P55 5G: దేశంలో ఛీపెస్ట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇదే! ధర ఎంతంటే!

itel p55 5g smartphone

అతి తక్కువ ధరలో 5g Smartphone కోసం చూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. Itel P55 5G మంగళవారం భారత మార్కెట్లో విడుదలైంది. దేశంలోనే cheapest 5G smartphone ఇదేనని కంపెనీ క్లెయిమ్‌ చేస్తోంది. ఇందులో అక్టాకోర్‌ డైమెన్సిటీ చిప్‌సెట్‌ ఉంది. అలాగే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. కృత్రిమ మేథస్సు ఆధారంగా రూపొందించిన డ్యుయల్‌ రియర్‌ కెమేరా యూనిట్‌ వస్తోంది. సింగిల్‌ స్టోరేజ్‌ సదుపాయంతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. ఇక పదివేల లోపు స్మార్ట్‌ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

Itel P55 5G price in India, availability

ఐటెల్‌ ఇండియా 5g స్మార్ట్‌ఫోన్‌తో పాటు itel S23+ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. ఇది బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌. వంపులు తిరిగిన అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్లపై కంపెనీ రెండేళ్ల వారంటీ ఇస్తోంది. కొనుగోలు చేసిన వంద రోజుల వరకు ఉచిత స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ఇస్తోంది. నీలం, ఆకుపచ్చ రంగుల్లో వస్తున్న itel p55 5gలో 8GB + 128GB స్టోరేజీ ఉంటుంది. ఈ మొబైల్‌ ధర రూ.9,999. అక్టోబర్‌ 4 నుంచి అమెజాన్లో కొనుగోలు చేసుకోవచ్చు. Itel కంపెనీలో అతి తక్కువ దొరికే ఫోన్లు ఇవే!

Itel P55 5G specifications, features

Itel P55 5Gలో 6.6-inch HD+ (1600 x 700 pixels) డిస్‌ప్లే ఉంది. రెండు నానో సిమ్‌లు వాడుకోవచ్చు. రిఫ్రెష్‌ రేటు 90Hz. ఇందులో octa-core MediaTek Dimensity 6080 SoCను ఉపయోగించారు. దాంతోపాటు ARM Mali-G57 MC2 GPU ఉంటుంది. 8GB of RAM and 128GB ఉన్నప్పటికీ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ ద్వారా 256GBకి పెంచుకోవచ్చు. ఇక మొబైల్లో Android 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వాడారు.

ఫోటోలను ఇష్టపడేవారి కోసం Itel P55 5Gలో 50 మెగా పిక్సెల్‌ ప్రైమరీ రియర్‌ కెమేరా యూనిట్‌ ఇచ్చారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు సెకండరీ ఏఐ కెమేరా ఉంటుంది. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్‌ సెన్సర్‌తో కూడిన లెన్స్‌ ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 18W వైర్‌ ఛార్జర్‌ ఇచ్చారు. పైగా ఈ ఫోన్లో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఇచ్చారు. 3.5mm ఆడియో జాక్‌ ఉంది. 5G, 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.1, GPS, USB Type-C connectivity ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top